అవినీతి సొమ్ముతోనే హోటల్స్ పెట్టిండు..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంపీ చామల ఫైర్

అవినీతి సొమ్ముతోనే హోటల్స్ పెట్టిండు..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంపీ చామల ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన అవినీతి సొమ్ము, ఫార్ములా ఈ కార్ రేస్ డబ్బులతోనే కేటీఆర్ హైదరాబాద్ లో హోటల్స్ కొన్నారని ఎంపీ చామల  ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న వారు సైతం ఒక హోటల్, జూబ్లీహిల్స్ లో ఇళ్లు కొనలేకపోయారని, కాని కేటీఆర్ మాత్రం అమెరికాలో ఆరేళ్లు ఉండి మూడు స్టార్ హోటల్స్ కొన్నాడంటే...అర్థం చేసుకోవచ్చన్నారు. పది స్టార్ హోటల్స్ కొనే సామర్థ్యం ఉన్న కేటీఆర్...తెలంగాణను ఎందుకు ధనిక రాష్ట్రం చేయలేదని ప్రశ్నించారు.